Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మాచవరం-మర్రిచెట్టుపాలెం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై హజరత్తయ్య కథనం ప్రకారం.. గుంటూరుకి చెందిన తాళ్లూరి అశోక్‌ మండలంలోని మాచవరానికి చెందిన మహిళను వివాహం చేసుకుని ఆరేళ్లుగా ఇక్కడే ఉంటూ వెల్డింగ్‌ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన వృత్తికి సంబంధించిన వస్తువులను తీసుకుని రావటానికి టీవీఎస్‌పై నకరికల్లు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మాచవరం తాటి చెట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఘటనలో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పొలాలకు వెళ్లి వస్తున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మార్గంలో వచ్చిన వాహనదారులను విచారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని