Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదనపు కొవిడ్‌ కేంద్రాల ఏర్పాటుకు వినతి

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు గిరిధర్‌రావు, ముస్తఫా, మేయర్‌ మనోహర్‌నాయుడు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అదనపు కొవిడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌రావు, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను బుధవారం కలెక్టరేట్‌లో కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయని, శివారు ప్రాంతాల్లోని భవనాలు, అపార్ట్‌మెంట్స్‌, కల్యాణ మండపాల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మెడికల్‌ సిబ్బందిని, వైద్యులను ఏర్పాటు చేసి తక్కువ కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న రోగులకు శివారు ప్రాంతాల్లో చికిత్స అందించాలని తెలిపారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ స్పందిస్తూ అదనపు కొవిడ్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 50 శాతం పడకలు కోరుతున్నామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని