Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసు జాగిలం మృతి

జాగిలానికి నివాళులర్పిస్తున్న అధికారులు, సిబ్బంది

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసు కార్యాలయం జిల్లా భద్రతా విభాగానికి చెందిన పోలీసు జాగిలం హంటర్‌ బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. లాబ్రడార్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన హంటర్‌ 2014లో గ్రామీణ గుంటూరు జిల్లా పోలీసుశాఖ భద్రతా విభాగంలో అడుగు పెట్టింది. ఏఆర్‌ కానిస్టేబులు టి. రవికుమార్‌ హంటర్‌కు సంరక్షలుగా ఉన్నారు. బాంబులు ఇతర, పేలుడు పదార్థాలు గుర్తించడంలో, అనేక నేరాల దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచింది. హంటర్‌ మృతికి రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తమ సానుభూతి తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో బుధవారం పోలీసు కార్యాలయంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హంటర్‌  సంరక్షకులు రవికుమార్‌ నివాళులర్పిస్తూ రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. ఏఆర్‌ ఏఎస్పీ ప్రసాద్‌, ఆర్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని