Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏఆర్‌ ఎస్‌ఐకే టోకరా

మంగళగిరి, న్యూస్‌టుడే: పోలీసు అధికారికి గుర్తు తెలియని వ్యక్తి కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పోలీసు 6వ బెటాలియన్‌లో కొండాల నారాయణరావు ఏఆర్‌ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈ నెల 19న మంగళగిరి నగర శివారు  ఆత్మకూరు స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎంలో నగదు ఉపసంహరించడానికి వెళ్లారు. ఆయన వెనుక ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి డెబిట్‌ కార్డు ఇచ్చారు. తనకు వేగంగా ఆపరేట్‌ చేయడం రాదని.. నగదు ఉపసంహరించి ఇవ్వమని కోరారు. ఆగంతకుడు ఏటీఎంలో కార్డు పెట్టి పిన్‌ నమోదు చేయించాడు. సెల్‌ఫోన్‌కి వచ్చిన ఓటీపీ నమోదు చేసి రూ.20 వేలు ఉపసంహరించారు. ఆగంతకుడు ఇచ్చిన కార్డు తీసుకుని ఆయన ఇంటికి వచ్చేశారు. మరుసటి రోజు ఫోన్‌కి నగదు నిల్వ రూ.68 ఉందని బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. కార్డు చూసుకోగా వేరే పేరుతో ఉంది. గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడని తెలుసుకుని బ్యాంకు సిబ్బందిని సంప్రదించారు. ఖాతాలోని రూ.46 వేలు ఉపసంహరించారని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గ్రామీణ సీఐ శేషగిరిరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని