Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుబంధాలు మాయం!

కరోనా అనుమానంతో అనాథలా అంత్యక్రియలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: అనుబంధం, ఆప్యాయతలు అంతా ఒక భూటకం.. ఆత్మతృప్తికై ఆడుకునే వింత నాటకం.. అన్నట్లుగా ఉన్నాయి మనుషుల మధ్య బంధాలు. సాధారణ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి మృతి చెందగా కరోనా పాజిటివ్‌ అనే అనుమానంతో ఆయన్ను శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా అనే అనుమానం పెనుభూతంలా మారి మానవ సంబంధాలను తుంచేస్తుంది. గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి స్వల్పంగా జ్వరం రావడంతో మంగళవారం ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చేరారు. ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేశారు. చికిత్స అందిస్తుండగానే రాత్రికి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. బంధువులకు సమాచారం ఇచ్చినా కొందరు వచ్చారు. ఇరుగు పొరుగు వారు అటు వైపే చూడటం మానేశారు. భర్తను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న భార్యకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. రక్త సంబంధీకులు వచ్చినా ఎవరూ శ్మశానంలో అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనాథలకు అంత్యక్రియలు నిర్వహించే అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారికి ఫోన్‌ చేసి సమాచారం తెలియజేయటంతో వారి ప్రతినిధులు వచ్చి వాహనంలో మృతదేహాన్ని తీసుకుని వెళ్లి శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరు తనవారు? ఎవరు పొరుగు వారు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని