Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాపారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: కరోనా కట్టడిలో భాగంగా విధించిన నిబంధనలు వ్యాపారులు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డివిజన్‌ పరిధిలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. గతంలో ఉన్న సమయ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్కు ధరించాలన్నారు. మాస్కు లేకుండా రోడ్లపైకి వస్తే రూ.100 జరిమానా విధిస్తారన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలన్నారు. కొవిడ్‌ నివారణలో భాగంగా డివిజన్‌ పరిధిలోని ఈత కొలనులు మూసివేయాలని ఆదేశించామన్నారు. సినిమా ధియేటర్ల యాజమాన్యాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని