Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోర్టు తీర్పు పాటించాల్సిందే..!

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని మసీదు మాన్యం స్థలంపై కోర్టు తీర్పు పాటించాల్సిందేనని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం మసీదు మాన్యం కొచ్చి కొందరు స్థిరాస్తి వ్యాపారుల కోసం విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిపేశారని విమర్శించడంపై ఎమ్మెల్యే స్పందించారు. గత 2012లోనే మసీదు మాన్యం లో ఉండేవారికి రేషన్‌కార్డు, విద్యుత్తు కనెక్షన్‌ ఇతరత్రా సౌకర్యాలు కల్పించొద్దని కోర్టు చెప్పిందన్నారు. సీపీఐ నాయకులు నగదు తీసుకొని స్థలాలు ఇచ్చినట్లు కాలనీ వాసులు తనకు చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు విషయం తెలియకపోవచ్చని మిగిలిన వారందరికీ తెలుసని వివరించారు. పట్టణ నడిబొడ్డున అన్యాక్రాంతమైన ఏబీఎం పాఠశాల ఆస్థులను చట్టప్రకారం ఆ సంస్థకు అప్పగించేందుకు తన వంతు సహకారమందిస్తానని చెప్పారు. మిగిలిన స్థలంలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకోనన్నారు. అనుమతులు తీసుకొని లేఅవుట్లు వేస్తే తనకు అభ్యంతరం లేదని ఏమీ లేకుండా ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. కరోనా వినుకొండ ప్రాంతంలో తీవ్రంగా ఉందని అధికార యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలి
వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని మసీదు మాన్యం వాసులు బుధవారం నిరాహార దీక్షలు చేపట్టారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని గత్యంతరం లేకనే ఆందోళనకు దిగామని పేర్కొన్నారు. సీపీఐ నాయకులు మారుతీవరప్రసాద్‌, సండ్రపాటి సైదా శిబిరాన్ని సందర్శించి దీక్షలకు మద్దతు ప్రకటించారు.పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని