Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందరూ అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ

హిమబిందుతో మాట్లాడుతున్న డీఐజీ త్రివిక్రమవర్మ

తాడేపల్లి, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ అన్నారు. గత ఏడాది ఆపరేషన్‌ ముస్కాన్‌లో గుంటూరు అర్బన్‌ పోలీసులు గుర్తించిన హిమబిందు అనే బాలికను తాడేపల్లి పరిధి డోలాస్‌నగర్‌ వద్ద ఉన్న వీధి బాలికల వసతిగృహం (కరుణాలయం)లో చేర్పించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను పోలీసు శాఖ తరఫున డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తీసుకున్న విషయం విదితమే. ఇందులో భాగంగా డీఐజీ బుధవారం కరుణాలయాన్ని సందర్శించి బాలిక యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏం చదువుతోంది? ఎక్కడ చదువుతోంది? అనే విషయాలను నిర్వాహకులను అడిగారు. అనంతరం ఆమెకు నూతన వస్త్రాలు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా బాలికతో కేకు కోయించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ బాలికకు ఏదైనా అవసరమైతే తమను సంప్రదించాలని లేదా, డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్వాహకులకు సూచించారు. అదనపు ఎస్పీ ఈశ్వరరావు, గుంటూరు ఉత్తర మండల డీఎస్పీ దుర్గాప్రసాద్‌, మంగళగిరి గ్రామీణ, పట్టణ సీఐలు శేషగిరిరావు, శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు వినోద్‌కుమార్‌, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని