Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ పరీక్షలు ప్రారంభం

మ్యాప్‌ పాయింటింగ్‌ చేస్తున్న క్యాడెట్లు

మారుతీనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: మూడేళ్ల అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లకు నిర్వహించే ‘సీ’ సర్టిఫికెట్‌ పరీక్షలు గుంటూరు పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. క్యాడెట్లకు బుధవారం ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహించారు. 1 ఇంజినీర్స్‌, 2 ఆర్మ్‌డ్‌, 10 గరల్స్‌, 22, 25 బెటాలియన్లకు చెందిన 731 మందికిగాను 672 మంది హాజరైనట్లు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఆర్‌.జయకుమార్‌ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించామన్నారు. ఈనెల 25 రాత పరీక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీవోలు కల్నల్‌ ఎస్‌.కె.సింగ్‌, కల్నల్‌ సి.శ్రీనివాసరావు, కల్నల్‌ బక్షి, లెఫ్టినెంట్‌ కల్నల్స్‌ టి.వి.ఆర్‌.సత్యనారాయణ, చందా, ఎం.సాంబశివరావు, ఎస్‌ఎం యూసఫ్‌, ఏఎన్‌వోలు, పీఐ, సివిల్‌ సిబ్బంది. పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని