Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క రోజే 1,236 కేసులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కొత్త కేసుల్లో బుధవారం నూతన గరిష్ఠం నమోదైంది. 24 గంటల వ్యవధిలో 1,236 మంది వైరస్‌ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి చూస్తే ఒక్క రోజు కేసుల్లో ఇదే అత్యధికం. మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 6,354కు చేరగా.. అందులో 70 శాతం కేసులు గత రెండు వారాల్లోనే నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 697ని చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 89,946కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో 61.24 శాతం నమోదు కావడం గమనార్హం. ఈ మూడు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: అమరావతి-8, అచ్చంపేట-3, బెల్లంకొండ-4, గుంటూరు రూరల్‌-19, క్రోసూరు-5, మంగళగిరి-117, మేడికొండూరు-6, ముప్పాళ్ల-2, పెదకాకాని-12, పెదకూరపాడు-5, పెదనందిపాడు-5, ఫిరంగిపురం-3, ప్రత్తిపాడు-14, రాజుపాలెం-6, సత్తెనపల్లి-18, తాడేపల్లి-93, తాడికొండ-8, తుళ్లూరు-24, వట్టిచెరుకూరు-1, గుంటూరు-547, దాచేపల్లి-5, దుర్గి-3, మాచవరం-2, మాచర్ల-7, పిడుగురాళ్ల-10, చిలకలూరిపేట-17, యడ్లపాడు-2, ఈపూరు-4, నాదెండ్ల-7, నరసరావుపేట-86, నకరికల్లు-5, రొంపిచర్ల-6, వినుకొండ-4, అమృతలూరు-4, భట్టిప్రోలు-5, బాపట్ల-12, చేబ్రోలు-12, దుగ్గిరాల-9, కాకుమాను-3, కొల్లిపర-11, కొల్లూరు-9, నగరం-3, నిజాంపట్నం-4, పొన్నూరు-5, రేపల్లె-11, తెనాలి-74, చుండూరు-10, వేమూరు-6.
4,365 మందికి టీకా
గుంటూరు వైద్యం: జిల్లాలో బుధవారం 4,365 మంది కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,49,024 మందికి టీకా వేశారు. రెండో డోసు 1,833 మందికి వేశారు. 35 వేల డోసుల టీకా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని