Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

23 నుంచి చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై ఈనెల 23 నుంచి 30 వరకు శ్రీప్లవ నామ సంవత్సర చైత్ర మాస కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్య శివప్రసాద శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు ఉదయం 9.10గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం 4గంటలకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 24 నుంచి 27 వరకు ఉదయం 8 గంటల నుంచి మూలమంత్రహవనాలు, సాయంత్రం 4 నుంచి 6.30గంటల వరకు హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ చేస్తారని పేర్కొన్నారు. 25న ప్రముఖ కవిపండితులతో రాయబారం, రాత్రి 11గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 26 సదస్యం, వేదస్వస్తి, 27న పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృత స్నానాలు, ధ్వజారోహణ కార్యక్రమాలతో కల్యాణ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని