Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లలకు కొవిడ్‌ కేర్‌ కేంద్రం

కేంద్రాన్ని ప్రారంభించి ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ ప్రశాంతి, అధికారులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లల కోసం పీడియాట్రిక్‌ కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రారంభించారు. అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ వంద పడకలతో ఈ కేంద్రాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేశామన్నారు. పిల్లలను ఈ కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ఉంచి చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అనంతరం ట్రై ఏజ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ పి.ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ, వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌, డ్వామా పీడీ ఆనంద్‌నాయక్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఎ.వి.పటేల్‌, నోడల్‌ అధికారి జె.పి.డి.టాండన్‌, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని