Published : 22/04/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటి నుంచి వ్యాక్సినేషన్‌ రెండో డోసు

కలెక్టరేట్‌(గుంటూరు), గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోస్‌ను గురువారం నుంచి వేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ పి.ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 కేంద్రాల్లో రెండో డోసు వ్యాక్సిన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు, గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి డోస్‌ తీసుకున్న వారు రెండో డోస్‌ను తప్పక తీసుకోవాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం రెండో డోసు కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించాలని డీఎంహెచ్‌వో యాస్మిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని