Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పని తిరుగుపోటు..!

ఈనాడు, విజయవాడ: పురపోరు రసవత్తరంగా మారుతోంది. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికార పార్టీకి మాత్రం తిరుగుబాటు తప్పలేదు. కొన్ని వార్డులలో స్వతంత్రుల నుంచి గట్టిపోటీ ఏర్పడుతోంది. ఉపసంహరణల అనంతరం రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వార్డులలో, డివిజన్లల మద్దతులు మారుతున్నాయి. విజయవాడలో తెదేపా మేయరు అభ్యర్థిని ప్రకటించడంతో వివాదాలకు తెరపడింది. జిల్లాలో రెండు నగరపాలక సంస్థలకు, రెండు పురపాలక సంస్థలకు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెదేపా, సీపీఐ అవగాహన కుదుర్చుకోగా, జనసేన, భాజపా మధ్య పొత్తు కుదిరింది. ప్రచారానికి నేతలు రానున్నారు. అధికార పార్టీ వైకాపా తరపున మంత్రులు రంగంలోకి దిగారు.
విజయవాడలో 64 డివిజన్లు ఉండగా అధికార పార్టీకి అయిదు ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఆరోడివిజను నుంచి సారేపల్లి సుధీర్‌కుమార్‌ రెబల్‌గా రంగంలో దిగారు. వియ్యపు అమర్‌నాథ్‌ వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 15 వడివిజను నుంచి ఓ అభ్యర్థి వైకాపా తరఫున టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమె జనసేనపార్టీలో చేరి టిక్కెట్‌ తెచ్చుకున్నారు. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఉపసంహరించుకొని జనసేన అభ్యర్థినికి జైకొట్టారు. 18వ  డివిజనులో వైకాపా అభ్యర్థిగా వెంకట సత్యనారాయణకు టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో రెబల్‌గా జి.రమేష్‌ పోటీలో  ఉన్నారు. 21వ డివిజనులో పుప్పాల కుమారి అధికార పార్టీ అభ్యర్థిగా ఉండగా టిక్కెట్‌ ఆశించిన నిమ్మల జ్యోతి అసంతృప్తితో ఉన్నారు. మధ్య నియోజకవర్గం నుంచి 30వ డివిజనులో వైకాపా అభ్యర్థిగా జానారెడ్డికి టికెట్‌ ఇవ్వగా.. తుంపాల వరప్రసాద్‌ రెబల్‌గా పోటీలో ఉన్నారు. ఇద్దరూ జగన్‌ చిత్రంతో ప్రచారం చేస్తున్నారు. ఆ డివిజనులోనే తెదేపాకు తిరుగుపోటు ఉంది. పార్టీ తరపున గోగుల రమణ పోటీ చేస్తున్నారు. మాజీ డిప్యూటీ మేయరుగా పనిచేశారు. కేశినేని ఆయనకు టిక్కెట్‌ ఇవ్వగా.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆశీస్సులతో గరిమెళ్ల చిన్నా పోటీ చేస్తున్నారు. జనసేన, భాజపా పొత్తు కుదుర్చుకోగా.. 25, 28, 32 డివిజన్లలో ఇరు పార్టీల అభ్యర్ధులు రంగంలోకి దిగారు. 23వ డివిజనులో భాజపా అభ్యర్థిగా ఎన్‌ రంగారావును పోటీలో దించగా ఆయనకు పార్టీ గుర్తు రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. పార్టీ గుర్తు ప్రవీణకు వచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలోనూ సమీకరణాలు మారుతున్నాయి. 43వ డివిజను నుంచి రామిరెడ్డి వైకాపా రెబల్‌గా ఉన్నారు. వైకాపా అభ్యర్థిగా కోటిరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. 51వ డివిజనులో పైడిపట్టి మురళి రెబల్‌గా పోటీలో ఉండగా వైకాపా టిక్కెట్‌ రాజేష్‌కు వచ్చింది. 50 వ డివిజనులో జనసేన పార్టీకి చెందిన హరీష్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో జనసేన సీపీఎం అభ్యర్థికి అధికారికంగా మద్దతు ప్రకటించింది.

* నందిగామ నగర పంచాయతీలో ఒకటో వార్డు నుంచి పాకలపాటి కృష్ణ వైకాపా అభ్యర్థిగా రంగంలో ఉండగా.. తిరుగుబాటు అభ్యర్థిగా గుంటి విజయమ్మ రంగంలోకి దిగింది. 16వ వార్డులో వైకాపా అభ్యర్థిగా అచ్చి దివ్య పోటీ చేశారు. రెబల్‌గా నామినేషన్‌ వేసిన లక్ష్మీతులసి తెదేపాలో చేరారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఉండగా తెదేపా ప్రచారం చేస్తోంది.  20వ వార్డులో కర్రి రవీంద్రకు టిక్కెట్‌ ఇచ్చారు. ఇక్కడ చేపల మల్లికార్జునరావు వైకాపా రెబల్‌గా  ఉన్నారు.
* తిరువూరులోనూ 17వ వార్డులో పమ్మి రామకృష్ణ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీ టిక్కెట్‌ షేక్‌ జాకీర్‌కు ఇచ్చారు. ఉయ్యూరులో మాజీ కౌన్సిలర్‌ గుంజి రాంబాబు వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వైకాపా టిక్కెట్‌ గుంజి సుధాకర్‌బాబుకు ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని