Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇచ్చిన హామీలు నెరవేర్చిన సీఎం జగన్‌

సినీ నటుడు పోసాని కృష్ణమురళి

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో తెదేపా పని అయిపోయిందని, ప్రజలంతా వైకాపాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలను జగన్‌ అమలు చేసి నిరూపించారని చెప్పారు. కుల, మతాలకతీతంగా పరిపాలిస్తూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబును నమ్మేస్థితిలో లేరని, జగన్‌ని ఫేక్‌ ముఖ్యమంత్రి అని అనడం సరికాదని.. ఏం ఫేక్‌ చేశాడని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఈ విషయంలో కొందరు అవకాశవాద రాజకీయాలు చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని