Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దొంగ దొరికాడు

అమ్మవారి ఆభరణాలు స్వాధీనం

పోలీసుల అదుపులో నిందితుడు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణంలోని విశ్వదుర్గేశ్వరి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జక్కంపూడి సాయిబాబు 2018 ఆగస్టు 5న విశ్వదుర్గేశ్వరి ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆభరణాల దొంగతనం కేసులో సాయిబాబు అరెస్టు అయ్యాడని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న సాయిబాబును న్యాయస్థానం అనుమతితో ఇతర నేరాలపై ప్రశ్నించగా తాడేపల్లిగూడెంలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడని పేర్కొన్నారు. తమ విచారణలో విశ్వదుర్గేశ్వరి ఆలయంలో కాజేసిన ఆభరణాలను భీమవరంలోని ఓ బంగారం దుకాణంలో ఉంచినట్లు గుర్తించామన్నారు. ఆ దుకాణంలో 18.890 గ్రాముల బంగారం, 6.771 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సీఐ ఆకుల రఘు, ఎస్‌ఐ కె.గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని