
ఉత్సాహంగా పరుగు పోటీలు
జెండా ఊపి పోటీని ప్రారంభిస్తున్న రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: అవార (అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో రాజధాని పరిసర పొలాల్లో సాగే అవార ప్రకృతి శిబిరంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన పరుగులో పలువురు బాలికలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పౌరులు... పరుగు, ఆట పాటలతో ఆహ్లాదంగా గడిపారు. పరుగును రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ప్రారంభించి మాట్లాడుతూ చిన్నారులను సుశిక్షితులుగా తయారు చేసిన అవార ప్రకృతి శిబిర నిర్వాహకులు, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డను అభినందించారు. విజేతలకు అవార సభ్యులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పురప్రముఖులు డాక్టర్ కృష్ణమోహనరావు, డాక్టర్ భావినేని కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, అవార సభ్యులు శకుంతలాదేవి, డాక్టర్ దివ్య, కుమార్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఆక్టోపస్ శిక్షకులు వెంకటేష్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.