Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిఘా నీడలో పుర ఎన్నికలు

మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

నూజివీడు, న్యూస్‌టుడే: నగర, పుర పాలక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా.. మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు 25 ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. ఆదివారం నూజివీడు వచ్చిన సందర్భంగా సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం, నగదు  అక్రమ రవాణా నిరోధానికి 60 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. 4,500 మద్యం సీసాలు, 3,500 లీటర్ల నాటు సారాను స్వాధీన పరచుకుని, 20 వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలియజేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్సైలు, 1500 మంది పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో ఐదు కేసుల్లో రూ. 10 లక్షల నగదు స్వాధీన పరచుకున్నామన్నారు. ఎన్నికల విధుల మరుసటి రోజు తమ సిబ్బంది శివరాత్రి ఉత్సవాల బందోబస్త్‌ నిర్వర్తిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆర్‌ఆర్‌ పేట, ఎమ్మార్‌ అప్పారావు కాలనీల్లోని అతి సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లు, సారథి ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐలు వెంకటనారాయణ, మురళీకృష్ణ, ఎస్సైలు గణేష్‌కుమార్‌, రంజిత్‌కుమార్‌, రాజారెడ్డి ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని