Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళల్లో ధైర్యం.. స్ఫూర్తిదాయకం

కొవ్వొత్తుల ప్రదర్శనలో సీపీ బి.శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు తదితరులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : నేటి సమాజంలో మహిళలు అనేక ఒడిదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూనే అన్ని రంగాల్లో రాణిస్తూ.. సత్తా చాటుతున్నారని పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌ నుంచి విజయవాడ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకోవటమే కాకుండా పలు రంగాలను శాసించే స్థాయికి చేరుకున్నారన్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూనే.. మరోవైపు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ తమ శక్తిని నిరూపించుకుంటున్నారని కొనియాడారు. మహాత్మాగాంధీ రోడ్డులోని రాఘవయ్యపార్కు వరకు, అక్కడి నుంచి స్వరాజ్యమైదానం వరకు ప్రదర్శన కొనసాగింది. స్వరాజ్యమైదానం వద్ద ఆకాశంలోకి స్కై ట్యాన్‌ట్రిన్స్‌, పావురాలను ఎగురవేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ మేరీ ప్రశాంతి, డీసీపీలు విక్రాంత్‌ పాటిల్‌, వి.హర్షవర్ధన్‌రాజు, ఉదయరాణి, వాసవ్య మహిళా మండలి ప్రతినిధి బొల్లి కీర్తి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని