Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఈనాడు ఆటో ఎక్స్‌పో’కు విశేష స్పందన

లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న ఈసిటీ అధినేత ప్రేమ్‌కుమార్‌ తదితరులు

చుట్టుగుంట, న్యూస్‌టుడే: రెండు రోజుల పాటు మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘ఈనాడు ఆటో ఎక్స్‌పో-2021’ ఆదివారం  ముగిసింది. రెండోరోజు పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. స్టాళ్లలో ఏర్పాటుచేసిన వాహనాలను పరిశీలించి, వాటి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకుల ద్వారా అందే రుణ సదుపాయాలపై ఆయా స్టాళ్లలో సంప్రదించారు. నచ్చిన వాహనాలను కొనుగోలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రముఖ ఎలక్ట్రానిక్‌ అండ్‌ హోమ్‌ అప్లయిన్సెస్‌ సంస్థ ఇ-సిటి అధినేత ప్రేమ్‌కుమార్‌‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్కీ డిప్‌ డ్రాను  విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ మేనేజర్‌ సోమశేఖర్‌, పలువురు  స్టాల్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని