Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెయ్యికి పైగా ఖాళీలు

హాజరైన విశ్వాసులు, పాటలు పాడుతున్న పాస్టర్‌ జాన్‌ వెస్లీ ..

చిత్రంలో పాస్టర్లు ఆబ్రహం, రమేష్‌, రాజు
ఈనాడు-అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డీఎస్సీ నిర్వహించటానికి సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను కోరింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ వెయ్యికిపైగా ఖాళీలు ఉన్నాయంటూ ప్రతిపాదనలు ఇటీవల ప్రభుత్వానికి పంపింది. ఉపాధ్యాయ విద్య శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు త్వరలో కొత్త డీఎస్సీ రాబోతుందని తెలియటంతో వారిలో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన హేతుబద్ధీకరణ, బదిలీలు, పదవీ విరమణ వల్లే ఈ ఖాళీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. గుంటూరు బ్రాడీపేటతో పాటు తెనాలి, నరసరావుపేట కేంద్రాలుగా డీఎస్సీకి తర్ఫీదు ఇచ్చేకేంద్రాలు ఉన్నాయి. గడిచిన రెండేళ్ల నుంచి ప్రభుత్వ పరంగా డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడకపోవటంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాల ద్వారా చాలా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. ఈ సమస్యలను అధిగమించటానికి డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారు. గత డీఎస్సీలో సుమారు 300 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు భర్తీ  చేశాకే రెగ్యులర్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌  ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల ఖాళీలను ఎలా భర్తీ చేయాలో కోరుతూ మరో ప్రతిపాదన ప్రభుత్వానికి పంపామని విద్యాశాఖవర్గాలు తెలిపాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఉండే ఎస్‌జీటీలను డిప్యూటేషన్‌పై తీసుకోవటమా? లేక వాలంటీర్లను నియమించుకోవడమా అనే స్పష్టత రావాల్సి ఉంది.
సబ్జెక్టు ఖాళీలు
స్కూల్‌ అసిస్టెంట్‌
(ఎస్‌ఏ) (గణితం) 9
ఎస్‌ఏ భౌతిక శాస్త్రం 2
ఎస్‌ఏ ఆంగ్లం 11
ఎస్‌ఏ బయలాజికల్‌ సైన్స్‌ 26
ఎస్‌ఏ సాంఘికశాస్త్రం 40
ఎస్‌ఏ తెలుగు 14
ఎస్‌ఏ హిందీ 5
ఎస్‌ఏ ఉర్దూ 1
ఎస్‌ఏ (సోషల్‌ స్టడీస్‌ ఉర్దూ) 1
సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులు
(తెలుగు మీడియం) 880
ఎస్‌జీటీ (ఉర్దూ) 31
మొత్తం 1020


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని