Published : 08/03/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏర్పాట్లు చకచకా..!

ఈనాడు-అమరావతి: నగరపాలక సంస్థ ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 57 డివిజన్లలో ఒక డివిజన్‌ ఏకగ్రీవం కావటంతో మిగిలిన 56 డివిజన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు పరిధిలో 8 డివిజన్లలో కలిపి మొత్తం 5.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇప్పటికే అధికారులు కీలకమైన బ్యాలెట్‌ పత్రాలు ముద్రించి ఆ మేరకు సిద్ధం చేసుకున్నారు. బ్యాలెట్‌ పత్రాలు ముద్రించి వాటిని పోలింగ్‌ స్టేషన్ల వారీగా కట్టలు కట్టి 9వ తేదీన పోలింగ్‌ సిబ్బందికి అందజేయటానికి నల్లపాడు ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వతంత్రులకు బీరువా, ఎయిర్‌ కండీషనర్‌, బ్యాట్‌, బ్రెష్‌, బకెట్‌, కొవ్వొత్తు, కొబ్బరికాయ, మంచం, కరెంటు స్తంభం, గౌను, గ్యాస్‌ సిలిండర్‌, హెల్మెట్‌ తదితర గుర్తులు ఎక్కువ మంది కోరుకున్నారని తెలిసింది. 521 పోలింగ్‌ స్టేషన్లకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు సమకూర్చుకున్నారు. నగరపాలక, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

రెండు చోట్ల లెక్కింపు : 14న ఓట్ల లెక్కింపు నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, టెక్స్‌టైల్‌ కళాశాల, లయోలా పబ్లిక్‌ స్కూల్‌ భవనాల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నుంచి అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణ పత్రం జారీ చేసే వరకు మొత్తం ప్రక్రియను రెండు గంటల్లో ముగించేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  22 డివిజన్లకు సంబంధించిన ఓట్లు లయోలా పబ్లిక్‌ స్కూల్లో నిర్వహించేలా టేబుళ్లు సిద్ధం చేస్తున్నారు. 34 డివిజన్లకు సంబంధించిన లెక్కింపును పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తారు. ఇక్కడ 308 పోలింగ్‌ స్టేషన్ల లెక్కింపు ఉంటుందని అధికావర్గాలు తెలిపాయి. ఒకేసారి 521 పోలింగ్‌ స్టేషన్ల ఓట్ల లెక్కింపు చేపట్టడానికి వీలుగా సుమారు 3 వేల మంది సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి టేబుల్‌ వద్ద లెక్కింపు ప్రక్రియలు ఐదారుగురు ఉద్యోగులు విధి నిర్వహణలో ఉంటారు. 10న ఓటింగ్‌ ముగియగానే అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుంచి బ్యాలెట్‌  బాక్సులను నల్లపాడు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించాలని సిబ్బందికి సూచించారు. 9వ తేదీన పోలింగ్‌ సామగ్రిని నల్లపాడు పాలిటెక్నిక్‌ కళాశాల నుంచే పంపిణీ చేస్తామని నగరపాల కవర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని