close

తాజావార్తలు

‘లావణ్యకు పైసా ముట్టనిదే ఫైల్‌ కదిలేదికాదు’

తహసీల్దార్‌ అక్రమాలపై కేశంపేట వాసులు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య అక్రమాలు ఒక్కొకక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెళ్లి.. ఆమె చేతిలో ఇబ్బందులకు గురైన వారు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తన భూమి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్‌ అడ్డుపడ్డారని కేశంపేటకు చెందిన ఓ మహిళ వాపోయింది. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ కార్యాలయం ఎదుటే రోదించింది. లావణ్య వ్యవహారంపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కేశంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సరైన సమయంలో స్పందించి ఉంటే లావణ్య అవినీతి వ్యవహారం అప్పుడే బయటపడేదని బాధితులు పేర్కొంటున్నారు. రెవెన్యూ సేవలు అందించినందుకు ఎవరికీ ఒక్క రూపాయీ చెల్లించక్కర్లేదని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే.. తమ దృష్టికి తీసుకురావాలంటూ ఫోన్‌ నంబర్లను బోర్డులో పొందుపరిచారు. కానీ.. తహసీల్దారు లావణ్యకు మాత్రం పైసా ముట్టనిదే ఫైల్‌ కదిలేది కాదని కేశంపేట ప్రజలు చెబుతున్నారు. 

కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారంతో హయత్‌నగర్‌లోని లావణ్య నివాసంలో బుధవారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడటంతో ఆమె అవినీతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లావణ్యను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆమెను లోతుగా విచారించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనంతయ్యతో పాటు లావణ్యను బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసానికి తరలించారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.