close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుమతి లేని పరీక్ష... బాధితులకు శిక్ష..

ఇష్టారీతిన ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్‌ పేరిట పరీక్షలు

మంచిర్యాల నేరవిభాగం, మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్‌ బారిన యాంటీబాడీ పరీక్షలు చేస్తుండగా.. వైద్యం పేరుతో కొందరు ఆర్‌ఎంపీలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రమే నిర్వహించాలి. జిల్లాలో మొదట బెల్లంపల్లిలోని సింగరేణి ఆసుపత్రిలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు.. కొద్దిరోజుల నుంచి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో యాంటిజన్‌ (ర్యాపిడ్‌) విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ అనుమానిత బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో పరీక్ష కేంద్రాలకు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే తన విషయం బహిర్గతమవుతుందని చాలామంది అక్కడికి వెళ్లడానికి వెనుకాడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు అనుమతి లేకుండా ర్యాపిడ్‌, యాంటీబాడీ పరీక్షలు చేస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. బాధితులకు నివేదికలు ఇవ్వకుండానే కొవిడ్‌ పాజిటివ్‌ లేక నెగెటివ్‌ అంటూ నిర్ధారిస్తున్నారు. నివేదికలు ఇవ్వకుండా నిర్ధారణ జరిపితే ఒక వేళ పాజిటివ్‌ వ్యక్తికి నెగెటివ్‌ అని చెప్పినట్లయితే ప్రాణానికే ప్రమాదం లేకపోలేదు.

జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్‌ పరీక్ష చేసిన నాసిరకం కిట్‌ ఇదే

● గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తుండటంతో వారు కమిషన్‌ పద్ధతిలో ప్రైవేటు ల్యాబ్‌లు, సిటీస్కాన్‌లకు పంపిస్తూ ప్రాణాలతో చిల్లర వ్యాపారం చేస్తున్నారు. కరోనా పేరుతో ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్ధు అలాంటిది ర్యాపిడ్‌, ఆంటీబాడీ పరీక్షల పేరుతో రూ.4 వేల నుంచి రూ.6 వేలు, సిటీస్కాన్‌కు రూ.2500 నుంచి రూ.6 వేల వరకు సొమ్ము చేసుకుంటున్నారు.

పర్యవేక్షణ గాలికి..

జిల్లా కేంద్రంలో ప్రైవేటు ల్యాబ్‌లలో నిబంధనలు పాటించకుండా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. అయినా జిల్లా వైద్యాధికారులు ల్యాబ్‌లపై ఎలాంటి పర్యవేక్షణ ఉంచడం లేదు. పరీక్షల విషయంలో బాధితులకు ప్రాణహాని సైతం ఉంది. సిటీస్కాన్‌ల ధరలను ఇష్టారీతిన వసూలు చేస్తుండటంతో ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది.


‘పది రోజుల కిందట సీసీసీకి చెందిన ఒకరు జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్‌ఎంపీని సంప్రదించారు. కొవిడ్‌ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లో నిర్ధారణ చేస్తున్నారని బాధితుడిని ఆర్‌ఎంపీ నమ్మించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. రూ.లక్షతో వైద్యం చేస్తానని చెప్పారు. అనుమానంతో బాధితుడు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ర్యాపిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. తనలా ఎవరు మోసపోవద్దని బాధితుడు ఈనెల 5న సీసీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఎంపీపై కేసు నమోదైంది.’


‘జిల్లాకేంద్రంలోని హమాలివాడకు చెందిన ఓ యువకుడు తీవ్ర జ్వరంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో యాంటీబాడీ పరీక్ష చేయించుకున్నారు. రెండు రోజుల తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని చెప్పడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందారు. తర్వాత మంచిర్యాల ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్ష చేసుకోవడమే శ్రేయస్కరమని చెబుతున్నారు’

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.