close
Array ( ) 1

తాజా వార్తలు

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఆత్మహత్య

జూబ్లీహిల్స్‌: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎన్బీనగర్‌లో నివసించే దేశెట్టి రమేష్‌ కుమారుడు శ్రీశైలం (22) సమీపంలో నివసించే ఓ యువతి(22)ని పదో తరగతి చదివే సమయంలో ఇష్టపడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. శ్రీశైలం పదో తరగతితో చదువు ఆపేశాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 కూడలిలో ఉన్న ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఆమె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కొద్ది నెలల క్రితం ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. అయినా అతడు వెంటపడుతుండటంతో యువతి నెల రోజుల క్రితం షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వెంటపడొద్దంటూ పోలీసులు  అతడికి సూచించారు. శ్రీశైలం మరోసారి కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉంది. ఈలోపు మనస్తాపానికి గురైన శ్రీశైలం శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.