మహిళ దారుణ హత్య

తాజా వార్తలు

Published : 27/02/2021 00:45 IST

మహిళ దారుణ హత్య

వికారాబాద్‌ గ్రామీణం: గుర్తుతెలియని వ్యక్తులు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసిన ఘటన వికారాబాద్‌ సమీపంలోని ఆలంపల్లి-గెరిగేట్‌పల్లి రైల్వే వంతెన సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వికారాబాద్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  ధరూర్‌ మండలం హౌసుపల్లికి చెందిన అమృతమ్మ(38) అడ్డాకూలీ. గురువారం వికారాబాద్‌కు పనికోసం వచ్చిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె రాక కోసం ఎదురుచూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వికారాబాద్‌ పరిసర ప్రాంతాలు, తెలిసిన వారి ఇళ్లల్లో గాలించారు. ఆయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రైల్వే వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అమృతమ్మదిగా గుర్తించారు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని