
తాజా వార్తలు
సూరత్‌లో హైదరాబాద్ వాసులు మృతి
సూరత్: ఉత్తరాది నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సూరత్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో అడిక్‌మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ రమణ మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు. గాయాలపాలైన ఉద్యోగులు సత్యనారాయణ, కేశవరెడ్డి, పూజారి వెంకటేశ్వర శర్మలను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి..
బస్సును ఢీకొన్న బైకు..తండ్రీకుమారుడు మృతి
పెట్రోమంటలకు బడ్జెట్లో ఉపశమనం..?
Tags :