విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

తాజా వార్తలు

Updated : 10/07/2021 12:15 IST

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

తొర్రూరు: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. వ్యవసాయ మోటారు స్టార్టర్‌కు ఫీజులు వేసే క్రమంలో బోరుకు తగులుకొని ఉన్న జే తీగకు విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో తండాకు చెందిన భుక్యా సుధాకర్(28)‌, మాలోత్‌ యాకూబ్‌(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని