Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌

తాజా వార్తలు

Published : 21/04/2021 01:39 IST

Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌

విశాఖ: Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈనెల 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.. విచారణ చేపట్టి హైదరాబాద్‌లో భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిన్న కోర్టులో హాజరుపరిచామని.. మే 3వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్‌ చిప్పాడ విజయనగరం జిల్లా వాసి అని దిశ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని