గోదావరిలో ముగ్గురి గల్లంతు..ఒకరి మృతి

తాజా వార్తలు

Updated : 12/04/2021 09:56 IST

గోదావరిలో ముగ్గురి గల్లంతు..ఒకరి మృతి

కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహం చాగల్లుకు చెందిన సత్యనారాయణదిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆరుగురు యువకులు నిన్న ఓ సినిమా చూడటానికి కొవ్వూరుకు వెళ్లారు. తిరిగి వస్తూ సాయంత్రం ముగ్గురు యువకులు స్నానానికి గోదావరిలో దిగగా.. మిగతా ముగ్గురు తినుబండారాల కోసం వెళ్లారు. నదిలోకి దిగిన ముగ్గురు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. వీరిలో సత్యనారాయణ మృతదేహం గోష్పాద క్షేత్రం వద్ద లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులను హేమంత్‌, సోమరాజుగా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని