Disha encounter case: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం

తాజా వార్తలు

Published : 29/09/2021 02:03 IST

Disha encounter case: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంఘటనా స్థలంలో వివరాలు ఎందుకు సేకరించలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు సంఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేసుకున్నారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన బృందాన్ని సిర్పూర్కర్‌ కమిషన్‌ ఇవాళ విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు సంఘటనా స్థలంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయామని బృంద సభ్యులు వివరించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని మృతదేహాల పంచనామా కూడా పూర్తి చేశారని బృంద సభ్యులు కమిషన్‌కు వివరించారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సిర్పూర్కర్ కమిషన్ సెక్రటరీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సైబరాబాద్‌ సీపీగా ఉన్న విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలను తీసుకెళ్లిన డ్రైవర్లతో పాటు, డాక్టర్లను కూడా కమిషన్ విచారించే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని