Crime: ఏడు నెలల పసికందుపై అఘాయిత్యం?

తాజా వార్తలు

Updated : 21/07/2021 09:10 IST

Crime: ఏడు నెలల పసికందుపై అఘాయిత్యం?

పెదవులు, మర్మావయవాలపై గాయాలు.. జీజీహెచ్‌లో చికిత్స

మాచర్ల గ్రామీణ, విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: రాత్రి ఊయలలో చక్కగా నిద్రపోయిన చిన్నారి.. తెల్లారేసరికి ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉంది.. చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద గాయాలున్నాయి.. పసికందుపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ సంఘటన వెలుగుచూసింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారే సరికి లేచి చూస్తే ఊయలలో పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి పాప కోసం వెదుకులాట ప్రారంభించింది. వారుండే ఇంటికి కొద్ది దూరాన నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని గుర్తించింది. ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె చెరువైంది. హుటాహుటీన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాప పెదాలపై.. మర్మావయాలపై గాయాలు ఉండటంతో వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించి గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)కు రిఫర్‌ చేశారు. సమాచారం అందుకున్న మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించారు. చిన్నారి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోందని, వైద్యాధికారుల నుంచి నివేదిక వచ్చాకే అఘాయిత్యం జరిగింది .. లేనిది తేలుతుందని సీఐ భక్తవత్సలరెడ్డి పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారేమోనని తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి చూసి తల్లిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని