మేడికొండూరు గ్యాంగ్‌రేప్‌: కూలీలను ప్రశ్నించిన పోలీసులు

తాజా వార్తలు

Updated : 09/09/2021 14:00 IST

మేడికొండూరు గ్యాంగ్‌రేప్‌: కూలీలను ప్రశ్నించిన పోలీసులు

మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. సమీపంలోని కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణ పనులకు వచ్చిన ఒడిశా కార్మికులను పోలీసులు విచారించారు. అత్యాచార ఘటన నేపథ్యంలో వారి వద్ద ఉన్న వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలిని వైద్యపరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్‌పై వస్తుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని