AP News: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. నిద్రలోనే తండ్రీకుమారుడి సజీవ దహనం!

తాజా వార్తలు

Updated : 28/08/2021 09:21 IST

AP News: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. నిద్రలోనే తండ్రీకుమారుడి సజీవ దహనం!

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొమ్మిడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్‌ పేలడంతో వచ్చిన మంటల్లో నిద్రిస్తున్న బొమ్మిడి నాగరాజు(35), కుమారుడు రోహిత్ కుమార్(6) విగతజీవులుగా కనిపించారు. నాగరాజు భార్య, మరో కుమారుడు బంధువుల వివాహానికి ఊరు వెళ్లడంతో నాగరాజు రోహిత్‌తో కలిసి ఇంట్లో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని