Missing: వికారాబాద్‌లో తండ్రీ, కుమారుడి అదృశ్యం

తాజా వార్తలు

Updated : 14/09/2021 11:52 IST

Missing: వికారాబాద్‌లో తండ్రీ, కుమారుడి అదృశ్యం

వికారాబాద్‌: తండ్రీ, కుమారుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ కాలనీలో చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట తండ్రి కార్తీక్, నాలుగేళ్ల కుమారుడు హరీశ్‌ను తీసుకొని స్నాక్స్‌ తీసుకొస్తానని ఇంటి నుంచి బయటి వెళ్లాడు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం కుమారుడితో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు, మామకు కార్తీక్‌ మెసేజ్‌ పంపినట్లు సమాచారం. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. కార్తీక్‌ గతంతో ఓ కార్ల కంపెనీలో పని చేసేవాడని.. ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని