TS News: రైలు పట్టాలపై మృతదేహాల కలకలం

తాజా వార్తలు

Updated : 08/10/2021 15:06 IST

TS News: రైలు పట్టాలపై మృతదేహాల కలకలం

శంకర్‌పల్లి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. రైలు పట్టాలపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్థానికులు గుర్తించి వికారాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా లేక, వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు 30ఏళ్ల యువకుడు, మరొకరు 60ఏళ్ల వృద్ధుడు అని వికారాబాద్‌ రైల్వే ఇన్‌ఛార్జి ఎస్సై మల్లేష్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని