Crime News: వివేకా హత్య కేసు.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

తాజా వార్తలు

Updated : 28/10/2021 10:48 IST

Crime News: వివేకా హత్య కేసు.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న టి.గంగిరెడ్డి, వై.సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది.

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిన్న ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో నిన్న ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇవాళ పూర్తిస్థాయి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని