Crime News: తాను ప్రేమిస్తున్న యువతిని బైకుపై ఎక్కించుకున్నాడని కత్తితో దాడి..

తాజా వార్తలు

Updated : 18/09/2021 15:09 IST

Crime News: తాను ప్రేమిస్తున్న యువతిని బైకుపై ఎక్కించుకున్నాడని కత్తితో దాడి..

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న అర్ధరాత్రి సురేశ్‌ తన పాల బూత్‌లో పని చేస్తున్న యువతిని బైక్‌పై ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టాడు. తాను ప్రేమిస్తున్న యువతిని సురేశ్‌ బైకుపై ఎక్కించుకున్నాడనే కోపంతో ఓ యువకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సురేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్‌ మృతిచెందారు. ఘటన అనంతరం దాడి చేసిన యువకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని