Attack: హెయిర్‌ కటింగ్‌ విషయంలో గొడవ.. స్నేహితుడిపై కత్తెరతో దాడి

తాజా వార్తలు

Updated : 05/09/2021 12:02 IST

Attack: హెయిర్‌ కటింగ్‌ విషయంలో గొడవ.. స్నేహితుడిపై కత్తెరతో దాడి

పిడుగురాళ్ల: హెయిర్‌ కటింగ్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తిపై కత్తెరతో దాడికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న చల్లా శ్రీనివాసరావు కటింగ్‌ సరిగా చేయించుకోరా అని ఆంజనేయులుకు చెప్పారు. దీంతో ఆంజనేయులు.. శ్రీనివాసరావును తిట్టి ఆపై చెంప మీద కొట్టాడు.

దీన్ని చూసిన పక్కనే ఉన్న శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్ర ‘‘మా నాన్ననే కొడతావా’’ అంటూ స్నేహితుడైన ఆంజనేయులతో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఆంజనేయులు.. నాగేంద్రబాబు మెడపై ఎడమవైపు కత్తెరతో దాడి చేశాడు. ఘటనలో గాయపడిన నాగేంద్రబాబును పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని