Ts News: హరీశ్‌రావు కాన్వాయ్‌కు ప్రమాదం

తాజా వార్తలు

Updated : 21/06/2021 05:01 IST

Ts News: హరీశ్‌రావు కాన్వాయ్‌కు ప్రమాదం

సిద్దిపేట: సిద్దిపేట శివారులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. రహదారికి అడ్డుగా వచ్చిన అడవి పందులను తప్పించే క్రమంలో పైలట్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటన తర్వాత మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రిక కేసీఆర్‌ .. మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని