పాదచారులను ఢీకొన్న వాహనం..ఇద్దరి మృతి

తాజా వార్తలు

Updated : 03/05/2021 10:17 IST

పాదచారులను ఢీకొన్న వాహనం..ఇద్దరి మృతి

పోలవరం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని వెంకటాపురం సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలవరం నుంచి తొండపుడి వెళ్తున్న బొలెరో వాహనం రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన కొండిపుడి నాగరాజు(35), సారా కాంతారావు(30) అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరూ కూలీ పనులు చేయటానికి వెంకటాపురం వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆర్.శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని