close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/07/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లారీ బోల్తా: నలుగురి మృతి

తొర్రూర్‌ టౌన్‌: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూరు మండలం చీకటాయపాలెం చెరువు కట్టపై అర్ధరాత్రి  తుమ్మకర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, లారీ క్యాబిన్‌లో కూర్చున్న ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో 11 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు హార్యా(37), గోవింద్‌( 38), మధు(35), రాట్ల ధూర్యా(36)లుగా గుర్తించారు. లారీ క్యాబిన్‌లో కూర్చున్న ఏడుగురు కూలీల్లో భద్రు, రాములుకు తీవ్ర గాయాలవ్వటంతో మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ వెంకటరమణ, ఆర్డీవో ఈశ్వరయ్య ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండాకు  చెందిన 11 మంది కూలీలు చీకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో తుమ్మకర్రను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌కు  తరలించేందుకు కూలీ పనులకు వెళ్లారు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగివస్తున్న క్రమంలో వర్షం పడటంతో చీకటాయపాలెం చెరువు కట్టపై లారీ బోల్తాపడింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.