close

తాజా వార్తలు

Updated : 02/12/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోర్‌వెల్‌ వాహనం, కారు ఢీ: ఏడుగురి మృతి

చెవేళ్ల: హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద బుధవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. చేవెళ్ల సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది(ఇద్దరు చిన్నారులు సహా) కర్నాటక రాష్ట్రంలోని గుర్మిత్‌కల్‌కు తెల్లవారుజామున బయల్దేరారు.

 చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ఆసిఫ్‌ఖాన్‌(50), సానియా(18), నజియా బేగం(45), హర్ష(28), నజియా భాను(36), హర్షభాను(6), ఖలీద్‌ (43)గా గుర్తించారు. కరీనా బేగం, అయూమ్‌ ఖాన్‌, నిజార్‌బేగ్‌, అన్వర్‌ ఖాన్‌ లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడినవారిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, స్వల్పంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాద తీవ్రతతో కారు నుజ్జు నుజ్జయింది. ప్రమాద ఘటనతో బీజాపూర్‌ జాతీయరహదారిపై రెండుకిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. 



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని