‘నీ భార్యని వదిలేయ్‌.. ఎమ్మెల్యే అవుతావు’

తాజా వార్తలు

Published : 14/07/2021 01:20 IST

‘నీ భార్యని వదిలేయ్‌.. ఎమ్మెల్యే అవుతావు’

భర్త, జ్యోతిష్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

పుణె: కొందరు జాతకాలను నమ్ముతారు. మరికొందరు.. బాబాలు, జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూ మా దశ ఎప్పుడు మారుతుంది గురూజీ! అని అడుగుతుంటారు. ఇక అవే నమ్మకాలు అనర్థాలకు దారితీస్తే? సరిగ్గా ఇదే జరుగుతుందనడానికి పుణెలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన రఘునాథ్ రాజారామ్‌ ఎమూల్‌ (48)కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. దీంతో బాబాల బాట పడ్డాడు. ఇక ఓ బాబా.. నీ భార్యని వదిలిస్తే..కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులు వస్తాయని.. ఆమెతో కలిసి ఉన్నంతకాలం ఏ పదవీ దక్కదు’’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఆ మాటలను బలంగా నమ్మిన అతడు తన భార్య (27)ను వదిలించుకునేందుకు పన్నాగం రచించాడు. సూటి పోటి మాటలతో మానసికంగా వేధించేవాడు. అంతేకాదు  సిగరెట్లతో ఆమె శరీరంపై గాయాలు చేసేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు సైతం చిత్ర హింసలకు గురిచేసేవారు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆ మహిళ పోలీసు స్టేషన్‌లో.. భర్తతో సహా ఎనిమిది మందిపై కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బాబా చెప్పినట్టే తాను ప్రవర్తించానని రఘునాథ్‌ చెప్పాడు. మాయ మాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్న ఆ బాబాని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని