కర్ణాటకలో నలుగురి దారుణ హత్య
close

తాజా వార్తలు

Published : 13/07/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ణాటకలో నలుగురి దారుణ హత్య

ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం!

బెంగళూరు: కర్ణాటకలో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. రాయచూర్‌ జిల్లా సింధనూరులో నలుగురిని గుర్తు తెలియని ముఠా హత్య చేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. నలుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో సావిత్రమ్మ (55), శ్రీదేవి (38), హనుమేశ్‌ (35), నాగరాజు (33) ఉన్నారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యువతీ యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువకుడి బంధువులపై యువతి తరఫు బంధువులు దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని