
తాజా వార్తలు
న్యాయవాద దంపతుల హత్య కేసు: కత్తులు లభ్యం
మంథని: న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్యకేసులో నిందితులు ఉపయోగించిన కత్తులను పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53వ నంబర్ పిల్లర్ వద్ద కత్తులు లభ్యమయ్యాయి. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిందితులను నిన్న పార్వతి బ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈరోజు మళ్లీ గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నంబర్ పిల్లర్ వైపు గాలించగా అక్కడ కత్తులు లభ్యమయ్యాయి.
ఇవీ చదవండి
Tags :