close

తాజా వార్తలు

Published : 06/08/2020 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వార్డు నుంచి ఖైదీ పరారీ

కంకిపాడు(గ్రామీణం): కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సబ్‌జైలులోని 17మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఈడుపుగల్లులోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారిలో కె.వెంకటేశ్వరరావు గురువారం తెల్లవారుజామున పరారైనట్లు సిబ్బంది గుర్తించారు. వెంకటేశ్వరరావు ఇటీవల గుణదలలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు. అతని కోసం గాలిస్తున్నట్లు కంకిపాడు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.