తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై అత్యాచార నిందితుడు ప్రత్యక్షం

తాజా వార్తలు

Updated : 24/06/2021 11:26 IST

తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై అత్యాచార నిందితుడు ప్రత్యక్షం

అమరావతి: సంచలం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రత్యక్షమయ్యాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో నిందితుడు గూడ్స్‌ రైలు ఎక్కి పరారైనట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు రైల్వే ట్రాక్‌, రైల్వే యార్డ్‌ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రైల్వే వంతెనను నివాసంగా చేసుకొని నిందితుడు ఉంటున్నట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా నిందితుడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు.

గుంటూరు జిల్లా  తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద  ఈ నెల 19న కాబోయే భర్తతో నదీతీరానికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాబోయే భర్త కాళ్లు చేతులు కట్టేసి.. చంపుతామని బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, చెవి దిద్దులు లాక్కెల్లారు. దీంతో ఈ ఘటన పెను సంచలనమైంది. పోలీసులు నిందితుల కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని