రూ.కోటి విలువైన బంగారం పట్టివేత

తాజా వార్తలు

Updated : 14/04/2021 11:02 IST

రూ.కోటి విలువైన బంగారం పట్టివేత

పంచలింగాల: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఈ ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ.1.04 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి వీటిని మధురై తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న బంగారం, ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని