
తాజా వార్తలు
బాలికపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం!
ముజఫర్పూర్: ఇటీవల మధ్యప్రదేశ్లోని సిద్ధిలో చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన మరిచిపోకముందే బిహార్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేయడం కలకలం రేపింది. జనవరి 11న ఆమె ఇంట్లోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచిందని తెలిపారు. ఈ వ్యవహారంలో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..
దాహం అంటూ వచ్చి దారుణం
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు